Search This Blog

Saturday, March 26, 2011

బాలి గారు క్రియేట్ చేసిన గుండబ్బాయి క్యారెక్టర్ భంగిమలు











బాలి గారి గురించి



చిత్రకారులుగా శ్రీ బాలి అనేక కార్టూన్లు మరియు బొమ్మలు గీసారు. వీరి అసలు పేరు ఎం. శంకర రావు. వీరి స్వస్థలం అనకాపల్లి. బాల్యంలోనే బాలి తన తండ్రిని కోల్పొయారు. వాకిట్లో తల్లి వేసే ముగ్గులు నుండి ప్రేరణ పొంది చిత్రకళ మీద మక్కువ పెంచుకున్నారు. అనకాపల్లి లో ఇంటర్మీడియట్ వరకు చదువుకున్నారు. వేరే విషయాలమీద ఆసక్తి వున్నా డ్రాయింగ్ క్లాసులంటే ఎక్కువ ఇష్టపడేవారు.పట్టుదలతో కృషి చేసి చిత్రకళలో వున్నత శిఖరాలకు ఎదిగారు. శ్రీమతి పేరు ధనలక్ష్మి. వీరికి ఇద్దరు పిల్లలు, కుమార్తె వైశాలి మరియు కుమారుడు గోకుల్. ఉద్యోగరీత్యా పిల్లలిద్దరూ అమెరికాలో నివాసము ఉంటున్నారు.
కొత్తలో ఎం.శంకరరావు, అనకాపల్లి అన్న పేరుతో కార్టూన్లు వేశేవారు. 1970 సంవత్సర కాలంలో ఆంధ్రపత్రిక నిర్వహించిన కార్టూన్ పోటీలలో బాలిగారు వరుస బహుమతులను గెలుచుకునే సరికి కార్టూన్ కళనే జీవనోపాది గా చేసుకోవాలని నిర్ణయించుకుని PWD లో గుమస్తా ఉద్యోగానికి రాజీనామా చేసి బొమ్మలు గీయడం మీద మరియు కార్టూన్లు గీయడం మీద దృష్టి సారించారు.

బాలలకోసం "అమ్మే కావాలి" అన్న నవల వ్రాసి, బొమ్మలు కూడా తానె గీసి ఆంధ్రజ్యోతి వారపత్రికకు ప్రచురనార్ధమై పంపారు. ఆంధ్రజ్యోతి సచిత్ర వార పత్రికలో ధారావాహికగా ప్రచురించబడిన ఈ నవలను అప్పట్లో పాఠకుల మెచ్చుకున్నారు. శంకర రావు అని పిలిస్తే కళాత్మకంగా ఉండదని, ఆంధ్రజ్యోతి సంపాదకులు పురాణం సుబ్రహ్మణ్య శర్మ గారు "బాలి" అనే కలం పేరుని శంకర్ రావు గారికి బిరుదుగా ఇచ్చారు.
ఈ విషయాలను శ్రీ బాలి గారు కలర్ చిప్స్ ఇండియా లిమిటెడ్ లో అతనికి అసిస్టెంట్ గా పనిచేసిన రోజులలో నాకు స్వయముగా చెప్పారు.